Sunday, February 23, 2025

ఘరానా దొంగ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Thief arrested for committing crimes

 

హైదరాబాద్ : వివిధ నేరాలు చేస్తున్న ఘరానా దొంగను గోల్కొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని జహనూమాకు చెందిన అబ్దుల్ వాహీద్ ఖాన్ అలియాస్ వాహిద్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు చాలా రోజుల నుంచి హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో చోరీలు చేయడంతో 25 కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి నిందితుడిపై సస్పెక్ట్ షీట్‌ను పోలీసులు తెరిచారు. తాజాగా బైక్‌లను చోరీ చేయడంతో గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. ఎస్సై రాజేశ్వర్ రెడ్డి, పిసిలు నిందితుడిని పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News