Monday, December 23, 2024

ల్యాప్‌టాప్‌లు చోరీ చేస్తున్న నిందితుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హాస్టళ్లలో ల్యాప్‌టాప్‌లు చోరీ చేస్తున్న వ్యక్తిని, రిసీవర్లను ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 9ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.2,31,000 ఉంటుంది. ఎస్‌ఆర్ నగర్ ఎసిపి వెంకటరమణ తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపిలోని ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలం, పాతమళ్లాపురానికి చెందిన బండ్లమూడి చిన్నఅవులయ్య నగరంలోని ఎర్రగడ్డలో ఉంటున్నాడు. నందిగామ వెంకటకృష్ణ, మేకల వెంకటేశ్వర్లు రిసీవర్లుగా ఉన్నారు. వీరు చిన్నఅవులయ్య కొట్టేసిన ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేస్తున్నారు.

నిందితుడు గతంలో ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ తదితర ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. కొవిడ్ సమయంలో తన గ్రామానికి వెళ్లాడు. తర్వాత 2023లో తిరిగి హైదరాబాద్‌కు వచ్చి పిజి హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. హాస్టళ్లలో ఉంటున్నవారి ల్యాప్‌టాప్‌లను చోరీ చేసి విక్రయిస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి చోరీ చేస్తున్న నిందితుడిని, రిసీవర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఆర్ నగర్ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డిఐ గోపాల్, ఎస్సై రాజు కేసు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News