Sunday, December 22, 2024

చోరీకి వెళ్లి దొంగ మృతి..

- Advertisement -
- Advertisement -

మంచిర్యాలః దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటనప మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మంచిర్యాల ఐబి చౌరస్తా వద్ద ఉన్న ఓ ఇంట్లో చొరబడి దొంగతనానికి యత్నించిన ఓ దొంగ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. బావి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతర ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News