Sunday, December 22, 2024

కరెంట్ షాక్‌తో దొంగ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దొంగతనానికి వచ్చిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…పేట్‌బషీరాబాద్, కొంపల్లిలోని సెయింట్ ఆంటోనీ పాఠశాల సమీపంలో సునీత అనే మహిళ అద్దె ఇంటిలో ఉంటోంది. ఓ దొంగ ఆమె ఇంటి తలుపులు పగుల గొట్టి ఇంట్లోకి చోరబడ్డాడు. ఇంట్లో ఎలాంటి వస్తువులు దొరకకపోవడంతో నిరాశచెందాడు.

అదే సమయంలో ఇంట్లోకి ఎవరో వస్తున్నట్లు గమనించాడు. తనను పట్టుకుంటారని భావించి ఇంటి పక్కన ఉన్న కాంపౌండ్ వాల్‌పై నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో సోలార్ ఫెన్సింగ్ తీగలు తగలడంతో గుర్తుతెలియని వ్యక్తికి విద్యుత్ షాక్ రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News