- Advertisement -
హైదరాబాద్: బిజెపి ఎంపి డికె అరుణ ఇంట్లో కలకలం రేగింది. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించాడు. అర్థరాత్రి మాస్కు, గ్లౌజలు ధరించి వచ్చిన దుండగుడు ఇంట్లో హాలు, కిచెన్‌లో ఉన్న కెమెరాలను ఆఫ్ చేశాడు. ఆ తర్వాత ఇంట్లోనే గంటన్నర పాటు ఉన్నాడు. అయితే ఆ సమయంలో డికె అరుణ ఇంట్లో లేరు.. ఎలాంటి దొంగతనమూ జరుగలేదు. దీంతో ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డికె అరుణ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో ఏవైనా క్లూస్ దొరుతాయా అని క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. ఎంపి డికె అరుణ తనపై కుట్ర చేస్తున్నారనే అనుమానంతో తన ఇంటకి భద్రత పెంచాలని కోరారు.
- Advertisement -