ఛండీగఢ్: దొంగ దాడిలో మహిళ ఐఎఎఫ్ అధికారిణి మృతి చెందిన సంఘటన పంజాబ్ రాష్ట్రం పఠాన్‌కోటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఐఎఎఫ్ అధికారిణి అర్షితా జైస్వాల్ తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. అదే కాలనీలో మఖన్ సింగ్ అనే వ్యక్తి మెస్ వర్కర్‌గా పని చేస్తున్నాడు. ఆమె ఒంటరిగా ఉంటున్న విషయాన్ని గమనించాడు. అర్షితా ఇంట్లో నిద్రిస్తుండగా మెస్ వర్కర్ ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించాడు. దొంగను ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఆమె తలపై దొంగ కత్తితో దాడి చేయడంతో స్పృహతప్పి పడిపోయింది. మరుసటి ఉదయం అర్షితా ఇంటిరో ఐఎఎఫ్ అధికారిణి వెళ్లేసరికి ఆమె రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసియులో ఉంచి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. స్థానిక సిసి కెమెరాల ఆధారంగా మఖన్ సింగ్‌ను గుర్తించి అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తానే దాడి చేశానని ఒప్పుకోవడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కుతరలించారు.
Also Read: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త….