Wednesday, January 22, 2025

దొంగల దారిదోపిడీ… శృంగారం చేయాలని బెదిరింపు… హత్య

- Advertisement -
- Advertisement -

నార్సింగిలో దోపిడి దొంగల భీభత్సం
డబ్బుల కోసం యువకుడి హత్య
మరో వ్యక్తిని బెదిరించి రూ.15వేలు లాక్కున్న నిందితులు
పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి
బాలానగర్ ఎస్‌ఓటి పిసిలకు గాయాలు
ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరో: దోపిడి దొంగలు భీభత్సం సృష్టించిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి 3 గంటలకు చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో బాధితుడికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం…సన్‌సిటీ, హైదర్‌షాకోట్‌కు చెందిన కిషోర్ రెడ్డి, ట్రాన్స్‌జెండర్ నిహారిక అలియాస్ నరేష్‌ను వివాహం చేసుకున్నాడు. నిహారిక గురువారం తెల్లవారు జామున మంచిరేవుల సమీపంలో ఉండగా బైక్‌పై వచ్చిన కరణ్ సింగ్, మరో వ్యక్తి గొంతుపై కత్తి పెట్టి రూ.15,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు.

దానికి నిహారిక నిరాకరించడంతో డబ్బులు తీసుకోకుండా తమతో శృంగారంలో పాల్గొనాలని బెదిరించారు. దీనికి నిహారిక నిరాకరించడంతో ఆమెపై దాడి చేశారు. అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ కారు అటువైపు రావడంతో నిందితులు నిహారికను వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. అక్కడికి వచ్చిన పోలీసులకు నిహారిక విషయం చెప్పడంతో వారు నిందితుల కోసం గాలించడం ప్రారంభించారు. ఈ సమయంలోనే బాధితురాలు తన భర్త కిషోర్ రెడ్డికి ఫోన్ చేసి తనకు భయంగా ఉందని వెంటనే వచ్చి తీసుకుని వెళ్లాలని కోరింది. వెంటనే తన స్నేహితుడు శివరాజ్‌ను తీసుకుని కిషోర్ బయలు దేరాడు. నిహారిక వద్దకు రాగానే వారికి విషయం చెప్పింది.

కిషోర్ అతడి స్నేహితుడు శివరాజ్ ఇద్దరు నిందితుల కోసం వెతకగా ఎదురుపడ్డారు. తన భార్యతో ఎందుకు అసభ్యంగా ప్రవర్తించావని కిషోర్ వారిని నిలదీశాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది, ఆగ్రహంతో కరణ్ సింగ్ కత్తితో కిషోర్ ఛాతిపై పొడవడంతో కిందపడిపోయాడు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన శివరాజ్‌పై కూడా కత్తులతో దాడి చేయడంతో అక్కడి నుంచి బైక్‌పై పారిపోయాడు. వారి నుంచి తప్పించుకున్న నిహారిక డయల్ 100కు ఫోన్ చేయగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రక్తం మడుగులో పడి ఉన్న కిషోర్‌ను స్థానిక రెనోవా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితులపై నార్సింగి పోలీసులు 302,379, 394 ఐపిసి కింద రెండు కేసులు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

ముందుగా తులసి కుమార్‌పై దాడి…

కరణ్ సింగ్ మరో వ్యక్తి ముందుగా బైక్‌పై వెళ్తున్న తులసీ కుమార్‌ను ఆపి దాడి చేశారు. అతడి వద్ద ఉన్న రూ.15,000 లాక్కుని పారిపోయిన తర్వాత దారిలో ఉన్న నిహారికను బెదిరించారు. కరణ్‌సింగ్ గతంలో కూడా నేరాలు చేయడంతో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

పోలీసులపై దాడి…

నార్సింగి దోపిడీ కేసులో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులపై దాడి చేయడంతో కానిస్టేబుల్ రాజు, వినయ్‌కు గాయాలయ్యాయి. జగద్గిగిరిగుట్టలోని సిక్కు బస్తీకి చెందిన సర్దార్ కరణ్‌సింగ్, మరో వ్యక్తి నార్సింగి దోపిడీ కేసులో నిందితులుగా ఉన్నట్లు తెలియడంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే నిందితుడు ఎస్‌ఓటి కానిస్టేబుళ్లు రాజు ఛాతితో పొడిచాడు, వినయ్ తలపై కొట్టడంతో గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News