Wednesday, January 22, 2025

బ్యాంకులో చోరీకి విఫలయత్నం

- Advertisement -
- Advertisement -

బిచ్కుంద: మండలంలోని శాంతాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు తాళం పగుల గొట్టి గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకులో ప్రవేశించి, నగదు ఉన్న రూం డోరు తెరిచేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ అలారం మోగింది. దీంతో గమనించి దొంగ అక్కడి నుంచి పరారయ్యాడని స్థానికులు తెలిపారు. బ్యాంకు మేనేజర్ లతీఫ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే దొంగ అక్కడి నుంచి పారిపోయాడని, బ్యాంకులో నగదు గానీ, బంగారం కానీ ఏది చోరీకి గురికాలేదని మేనేజర్ తెలిపారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News