Tuesday, January 14, 2025

అంబులెన్స్ దొంగతనం చేసి పోలీసులకు చుక్కలు చూపించాడు… ఎఎస్ఐ పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ లో అంబులెన్స్ చోరీ చేసి విజయవాడకు పారిపోతున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు.  సినిమా స్టైల్లో అంబులెన్స్‌ను చేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు దొంగ పారిపోయాడు. హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. దొంగ అంబులెన్స్ సైరన్‌తో అతి వేగంతో పారిపోయాడు.

చిట్యాల వద్ద పట్టుకునే క్రమంలో ఎఎస్ఐ జాన్ రెడ్డిని ఢీకొట్టి పారిపోయాడు. జాన్ రెడ్డి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. జాన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్‌ను అంబులెన్స్ తో ఢీకొట్టి పారిపోయాడు. సూర్యాపేటలోని టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి దొంగను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు గతంలో కూడా పలు చోరీలు చేసినట్టు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News