- Advertisement -
ఛండీగఢ్: ఓ దొంగ 1700 టీకాలను ఎత్తుకెళ్లి పోలీసులకు తిరిగిచ్చిన సంఘటన హర్యానాలోని జింద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జింద్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో 1700 కోవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల పెట్టెను ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. పెట్టె ఓపెన్ చేసి చూడగా అందులో 1700 కరోనా టీకాలను గుర్తించాడు. వెంటనే టీ స్టాల్ దగ్గరికి వెళ్లి తాను పోలీసులు ఆహారం సరఫరా చేస్తానని, తనకు పని ఉండడంతో ఈ పెట్టెను పోలీసులకు ఇవ్వాలని టీ స్టాల్ యజమానికి తెలిపి అక్కడి నుంచి పారిపోయాడు. పెట్టె ఓపెన్ చేసి చూడగా అందులో ఉత్తరం ఉంది. టీకాలు అని తెలియక దొంగతనం చేశానని క్షమించండి అని రాశాడు. రెమిడెసివిర్ ఇంజెక్షన్లుగా భావించి వ్యాక్సిన్లను దొంగ ఎత్తుకెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దొంగపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -