Sunday, December 22, 2024

దొంగతనానికి వచ్చిన దొంగ మృతి

- Advertisement -
- Advertisement -

చోరీకి వచ్చిన దొంగ డబ్బా మీదపడడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…గుర్తుతెలియని వ్యక్తి మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగ్రా స్వీట్ హౌస్ ఎదురుగా ఉన్న ఫాస్ట్‌ఫుడ్ డబ్బాలో చోరీ చేసేందుకు తెల్లవారుజామున 3.30 గంటలకు వచ్చాడు. ఒకవైపు ఉన్న డోర్ ఓపెన్ చేసిన దొంగ రెండో వైపు ఉన్న డోర్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా పైనుంచి డబ్బా మీదపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

ఉదయం 6గంటలకు అటువైపు వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. అక్కడికి సమీపంలో ఉన్న సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించగా దొంగ ఎలామృతిచెందింది తెలిసింది. మృతిచెందిన వ్యక్తి వివరాలు ఇప్పటి వరకు తెలియలేదని, పోలీస్ డేటా బేస్‌లో వెతుకుతున్నామని మధురానగర్ ఇన్స్‌స్పెక్టర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News