Wednesday, January 22, 2025

ఇళ్లల్లో చోరీ చేస్తున్న దొంగ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Thief who was stealing from houses was arrested

రూ.40,000 నగదు స్వాధీనం

మనతెలంగాణ, హైదరాబాద్ : ఇళ్లల్లో చోరీలు చేస్తున్న దొంగను చిలకలగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.40,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని బోరబండ, ఫతీమా నగర్‌కు చెందిన మహ్మద్ కరీం అలియాస్ అబ్దుల్ కరీం కూలీ పనిచేస్తున్నాడు. భువనగిరికి చెందిన మచ్చ రాములు కుమారుడు ప్రవీణ్ కుమార్ ఆరోగ్యం బాగలేకపోవడంతో గాంధీ ఆస్పత్రికి చికిత్స చేయిస్తున్నారు. ఆస్పత్రి మూడో ఫ్లోర్‌లో రాములు సోదరి మంగ సోదరుడు ఇచ్చిన రూ.90,000 తన వద్ద పెట్టుకుని నిద్రిస్తోంది. తెల్లవారి లేచి చూసేసరికి అందులోని రూ.40,000 లేవు వెంటనే సోదరుడికి విషయం చెప్పింది. దీంతో బాధితుడు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్లు నరేష్, నాగేశ్వరరావు, ఎస్సై కృష్ణ తదితరులు పట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News