Monday, December 23, 2024

ఊరికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల

- Advertisement -
- Advertisement -

హయత్‌నగర్‌ః తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తు దోంగలు భీభత్సం సృష్ఠించారు. సుమారు 6 తులాల బంగారం, లక్ష రుపాయల నగదును అపహరించినట్లు గుర్తించారు. ఇట్టి సంఘటణ ఆదివారం రాత్రి హయత్‌నగర్ పోలీస్ స్టెషన్ ఫరిధీలో చోటు చేసుకుంది. పోలీసులు, బాదితులు తెలిపిన వివరాల ప్రకారం హయత్‌నగర్ డివిజన్ లక్ష్మప్రియ కాలనీ ఫేజ్ 2లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తు మూడు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. కాలనీకి చేందిన ఆర్ కృష్ణయ్య ఆర్‌టిసి కండక్టర్ కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లడంతో ఇంటికి తాళం వేసి రాత్రి డ్యూటికి వెళ్లాడు.

తిరిగి సోమవారం ఉదయం వచ్చేసరికి ఇళ్లు తాళాలు పగలగోట్టి ఇంట్లో ఉన్న సుమారు 35 గ్రాములు ఉంగరాలు, 25వేల నగదు, వెండి వస్తువులు అపహరించినట్లు తెలిపారు. ప్రక్కనే ఉన్న మహెశ్వర్‌రెడ్డి విధులలో భాగంగా ఊరికి వెళ్లడం జరిగింది. భార్య రాణి ప్రక్కన ఉన్న కాలనీలో తన చేల్లలు ఇంటికి వెళ్లి పడుకుంది. ఉదయం వచ్చి చూసే సరికి తాళాలు పగల గోట్టి ఉన్నాయి. ఇంట్లో ఉన్న 8 గ్రాముల బంగారు గోలుసు, 30వేల నగదు, వెండి పాత్రను దోంగిలించినట్లు గుర్తించారు. మూడవ ఇళ్లు అంజిరెడ్డి ఇంట్లో ఉన్న 1.3 తులాల బంగారు రింగ్స్, 50వేల నగదును అపహరించినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News