Sunday, December 22, 2024

బేగంపేటలో దోపిడీకి యత్నం

- Advertisement -
- Advertisement -

ఓ ఇంట్లోకి చొరబడి దోపిడీకి యత్నించిన ఒక నిందితులను బేగంపేట పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పోలీసులు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. బేగంపేటలోని ఓ ఇంట్లోకి ఇద్దరు నిందితులు తుపాకులతో చొరబడి దోపిడీకి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన తల్లీ, కుమార్తెలు నిందితులపై తిరగబడడంతో అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే బాధితులు బేగంపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అందులో ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బేగంపేట ఇన్స్‌స్పెక్టర్ రామయ్య తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News