Wednesday, January 22, 2025

కమాండ్ కంట్రోల్ రూమ్ దొంగల అరెస్టు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కాపర్ వైర్లను చోరీ చేసిన నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.38లక్షల విలువైన 38 కాపర్ వైర్ బండిళ్లు, అంబులెన్స్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ ఎసిపి సుదర్శన్ పిఎస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం, గ్వాలియర్ జిల్లాకు చెందిన సోను ఖాన్ నగరంలోని టోలీచౌకిలో ఉంటు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, అస్సాం రాష్ట్రానికి చెందిన సౌరబ్ బిస్వాస్ సిసిసిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఒడిసా రాష్ట్రం, బాలేశ్వరి జిల్లాకు చెందిన బికాష్ రాంజన్ బెహేరా సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. శంకర్ కుమార్ పరారీలో ఉన్నాడు. నలుగురు నిందితులు కలిసి కాపర్ వైర్లను చోరీ చేసి ఎంబిటి నగర్‌కు చెందిన జంగం సురేష్, ఆవుల రాజు మల్లేష్, ఎండి అబిద్ హుస్సేన్‌కు విక్రయించారు. నలుగురు నిందితులు షాపూర్ జీ పల్లోంజీ కంపెనీలో పనిచేస్తున్నారు. నలుగురు కలిసి కమాండ్ కంట్రోల్ భవనం నిర్మాణానికి వాడుతున్న కాపర్ వైర్లను చోరీ చేయాలని ప్లాన్ వేశారు. నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలోని 38 కాపర్ వైర్ల బండిళ్లను చోరీ చేసి అంబులెన్స్‌లో ఎవరికీ అనుమానం రాకుండా తరలించారు. వాటిని ఎంబిటి నగర్, బల్కంపేట, ముషీరాబాద్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారం చేసే వారికి విక్రయించారు. షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ అడ్మిన్ ఇన్‌ఛార్జ్ పింగిళి నరేందర్ కాపర్ వైర్ల బిండిళ్లు కన్పించకపోవడంతో సిసిసి మొత్తం వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 10వ తేదీన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నలుగురు నిందితుల గ్యాంగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును బంజారాహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సై వెంకటేష్, క్రైం టీం సభ్యులు దర్యాప్తు చేశారు.

Thieves arrested in Police Command Control in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News