Sunday, February 23, 2025

ఇంటి ముందున్న కారును తగలబెట్టిన దొంగలు

- Advertisement -
- Advertisement -

చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న వడియారం వెంచర్ లో గుర్తు తెలియని దొంగలు కారును తగలబెట్టారు. ఎమ్‌ఎస్‌ఎన్ పరిశ్రమలో పని చేస్తున్న శ్రీనివాస్ తన ఇంటి ముందు తన అల్టో 800 కారును పార్కు చేసారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారుకు ఉన్న 3 టైర్లు, అవసరమైన సామాగ్రి తీసుకుని కారును తగలబెట్టినట్లు తెలిపారు. కారు మొత్తం తగలబడిపోయింది. ఈ విషయమై పోలీసులకు పి ర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News