Saturday, April 12, 2025

నగరంలో దొంగల హల్‌చల్

- Advertisement -
- Advertisement -

నగరంలో దొంగలు వరుసగా తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలు చేశారు. వరుసగా తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేసి బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకుని వెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం…సికింద్రాబాద్‌లోని , మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి దుండగులు రూ.5ల క్షలు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.

కాగా, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ చేసి రూ.3లక్షలు, 17 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరుస దొంగతనాలతో నగర ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. పోలీసులు గస్తీని ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News