Wednesday, January 22, 2025

పట్టపగలే దొంగల హల్‌చల్

- Advertisement -
- Advertisement -

చేగుంట: మెదక్ జిల్లా, చేగుంట మండల కేంద్రంలోని సీతారాంనగర్ కాలనీలో ఇంటి ముందు నిలిపిన కారు నుంచి గుర్తు తెలియని దొంగలు 5 లక్షల నగదు చోరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మిరుదొడ్డి మండలం, పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన బిల్డర్ విష్ణువర్దన్‌రెడ్డి సీతారాంనగర్ కాలనీలో ఇంటి ముందు ఉంచిన కారు అద్దాలు పగులగొట్టి కారు నుంచి 5 లక్షల నగదు చోరీ చేశారని ఫిర్యాదు చేశారు.

యూనియన్ బ్యాంకులో ఈ నగదును డ్రా చేసి ఇంటి ఓనర్లు ఇచ్చారని తెలిపారు. ఆ డబ్బులను కారులోనే ఉంచి, తన ఫ్రెండ్ ఇంటికెళ్లి టీ తాగుతుండగా నలుగురు వ్యక్తులు వచ్చి కారు అద్దాలు పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్ళారని, వారిని వెంబడించినా దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని సిఐ వెంకటేష్, ఎస్‌ఐ బాలరాజు తెలిపారు.సిసి ఫుటేజీలను పరిశీలించి, దుండగులను పట్టుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News