కాల్పుల కలకలంతో ఒక్కసారిగి గచ్చిబౌలి ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రీజమ్ పబ్‌లో కాల్పుల సంఘటనలో కానిస్టేబుల్, పబ్ బౌన్సర్ గాయాలపాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం… మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ శనివారం గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రీజమ్ పబ్‌కు వచ్చాడు. అతని సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకునేందుకు పబ్‌కు చేరుకున్నారు.
దీంతో ప్రీజమ్ పబ్‌కు వెళ్లిన మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి దుండగుడు ప్రభాకర్‌ను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా ప్రభాకర్ వెంకట్ రెడ్డిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డితో సహా పబ్ బౌన్సర్‌కు గాయలయ్యాయి. కాల్పుల్లో గాయపడిని వెంకట్‌రెడ్డిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు దొంగను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు.