Monday, December 23, 2024

గ‌ర్ల్స్ హాస్ట‌ల్ లో దొంగ‌ల హ‌ల్ చ‌ల్

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలంలోని అనంతసాగర్ శివారులో ఉన్న ఎస్‌ఆర్ యూనివర్సిటీ క్యాంపస్ గర్ల్ హాస్టల్‌లో ఆదివారం ఉదయం 4 గంటల సమయంల్ ముగ్గురు దొంగలు హల్ చల్ చేశారు. విద్యార్థినిలకు చెందిన మూడు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ చోరీ చేసి పారి పోతుండగా ఎస్‌ఆర్ యూనివర్సిటి సిబ్బంది వారిని వెంబడిస్తుండగా ఒక దొంగ బావిలో పడగా మరొకరు చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఒకరిని అదుపులో తీసుకున్నారు.

బావిలో దూకిన దొంగను హసన్‌పర్తి పోలీసులు, ఎస్‌ఆర్ యూనివర్సిటీ సిబ్బందితో కలిసి దొంగను తాళ్ల సహాయంతో పైకి తీసుకొని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు దొంగలను హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఇట్టి విషయమై స్థానిక పోలీసులను వివరణ కోరగా దొంగలది హైదరాబాద్‌కు చెందిన వారని ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News