Wednesday, January 22, 2025

సూర్యపేటలో పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద పోలీస్ హైవే మెట్రో వాహనాన్ని దొంగలించిన విచిత్ర సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్లితే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట టుటౌన్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన టిఎస్09పిఏ0658 నెంబర్ గల పోలీస్ వాహనం కొత్త బస్టాండ్ వద్ద తెల్లవారు జామున ఐదు గంటలకు గస్తీ విధులను నిర్వహిస్తున్న పోలీసులు వేరే కేసు కొరకు వాహనాన్ని బస్టాండ్ వద్ద నిలిపి వెళ్లారు.

ఇది గమనించిన దుండగులు వాహనాన్ని చోరీ చేసి తీసుకవెళ్లాడు. ఆ సమయంలో వాహనానికి తాళం ఉండటంతో దుండగుడు ఈజీగా వాహనాన్ని తీసుకవెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ వాహనాన్ని కోదాడ వద్ద ట్రేస్ చేసి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపడతున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News