Monday, December 23, 2024

వనస్థలిపురంలో భారీ దోపిడి.. బార్ మేనేజర్ నుంచి రూ.2కోట్లు దోచుకున్న దొంగలు..?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : బార్ యజమాని నుంచి భారీ ఎత్తున డబ్బులు దోచుకున్న సంఘటన వనస్థలిపురంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…వనస్థలిపురంలోని ఎంఆర్‌ఆర్ బార్ మేనేజర్ వెంకట్రామిరెడ్డి రాత్రి బార్‌ను మూసివేసి మరో వ్యక్తితో కలిసి డబ్బులు తీసుకుని ను తీసుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. బైక్‌పై వనస్థలిపురం చౌరస్తాకు చేరుకోగానే ఇద్దరు వ్యక్తులు వచ్చి వెంకట్రామిరెడ్డిపై దాడి చేసి డబ్బులు గుంజుకునేందుకు యత్నించగా ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలోనే రూ.25లక్షలు రోడ్డుపై పడడగా మిగతా డబ్బులను నిందితులు పట్టుకుని పారిపోయారు. బాధితుడు వెంకట్రామిరెడ్డి వెంటనే వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతంలోని సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

రెండు కోట్లా….రూ.50లక్షలా….

భారీ దోపిడిలో పలువిషయాలు బయటికి వస్తున్నాయి. బార్ యజమాని రూ.2కోట్ల నగదును తీసుకుని వస్తుండగా దోచుకున్నారని తెలుస్తోంది. ఇందులో రూ.25లక్షలు రోడ్డుపై పడగా వెంకట్రామి రెడ్డి తీసుకున్నాడని, మిగతా రూ.1.75కోట్లు దొంగలు తీసుకుని పరారయ్యారని తెలుస్తోంది. కాని బాధితుడు పోలీసులకు తాను రూ.50లక్షలు తీసుకుని బయలుదేరానని, అందులో కేవలం రూ.25లక్షలు మాత్రమే దొంగలు దోచుకున్నారని ఫిర్యాదు చేశాడు. బాధితుడు పోలీసులకు నగదుకు సంబంధించిన వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News