- Advertisement -
దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. దామరచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అజ్మీర మాలు ఓ ఇంటి స్థలం విక్రయానికి సంబంధించి మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పని పూర్తి చేసుకొన్నాడు. అక్కడి నుంచి తన మిత్రులతో కలిసి ఐదు లక్షల క్యాష్ కారులో పెట్టి భోజనం కోసం ఓ రెస్టారెంట్ ముందు కారు పార్కింగ్ చేశారు. వారిని అనుసరిస్తూ బైక్ మీద వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రెప్పపాటులో కారు అద్దాలు పగలగొట్టి ఐదు లక్షల క్యాష్ బ్యాగుతో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పైసలు అంటే విలువ లేకుండా అయిపోయిందని, సదరు వ్యక్తులకు మరి ఇలా వదిలేసి వెళ్తారా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: అదరగొడుతున్న వెల్లలాగే..
- Advertisement -