Tuesday, January 14, 2025

హైదరాబాద్ నడిబొడ్డున దర్జాగా దోపిడీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్(విద్యానగర్):బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి రెండున్నర కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఘటన దోమల్ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రత్య క్ష సాక్షులు, కార్మికులు, పోలిసుల కథనం మేర కు వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ కలకత్తాకు చెందిన రంజిత్ గౌరయ్ (55) గత కొన్నేళ్ల నుంచి దోమల్ గూడ అరవింద్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. జ్యుయలరీ దుకాణాల నుంచి బంగారు ఆభరణాల ఆర్డర్ తీసుకుని వా రికి కావలసిన విధంగా తయారు చేసి ఇవ్వడం రంజిత్ వృత్తి. ఆభరణాల తయారీ కోసం ఇతని వద్ద 30 నుంచి 40 మంది వరకు కార్మికులు పని చేస్తున్నారు. గురువారం తెల్లవారు జాము ఐదున్నర

గంటల ప్రాంతంలో ఐదారు మంది గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, ఇతర మార ణాయుధాలతో రంజిత్ ఇంటికి వచ్చారు. బెల్ కొట్టడంతో తలుపులు తెరిచిన రంజిత్‌ను కత్తుల తో బెదిరించిన అగంతకులు ఇంట్లో ఉన్న రెం డు కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. వెం టనే బాధితుడు సమాచారం ఇవ్వడంతో దోమల్‌గూడ పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం రంజిత్ నివాసంలో ఆధారాల కోసం తనిఖీ చేసి దోపిడీకి పాల్పడిన వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. రంజిత్ వద్ద పని చేస్తున్న కార్మికులు ఎవరైనా ఈ దొంగతనానికి పాల్పడ్డారా లేక ఇది తెలిసిన వక్తుల పనా అన్న కోణంలో చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News