Sunday, December 22, 2024

కంటైనర్‌లో సరుకును ఎత్తుకెళ్లిన దొంగల ముఠా

- Advertisement -
- Advertisement -

 

నిర్మల్: కంటైనర్ లారీని దొంగల ముఠా దోపిడీ చేసిన సంఘటన నిర్మల్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కంటైనర్ నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా దోపిడీ చేశారు. దొంగల ముఠా డ్రైవర్‌పై కత్తులు, రాళ్లతో దాడి చేశారు. డ్రైవర్‌ను బెదిరించి కంటైనర్‌ను దొంగలు ఖాళీ చేయించారు. కంటైనర్‌లో హల్దీరామ్ సంస్థకు చెందిన సరకు ఉన్నట్లు డ్రైవర్ తెలిపాడు. దారి దోపిడీపై బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News