Saturday, January 11, 2025

కనుల పండువుగా తిమ్మప్ప స్వామి కల్యాణం

- Advertisement -
- Advertisement -

మల్దకల్ : శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సం దర్భంగా సోమవారం శ్రీ లక్ష్మీ, పద్మావతి వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం కనుల పండుగగా జ రిగింది. ఆలయ అర్చకులు మధుసూదనాచారి, దీరేంద్రదాస్, రమేష్, రవి, నాగరాజు శర్మ, వేదమ ంత్రాలతో స్వామివారి కల్యాణాన్ని శాస్త్రంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని భూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సురేందర్‌రెడ్డి , రమ్య, గద్వాల పట్టణానికి చెందిన శివకేశవ లక్ష్మీ దంపతులు కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం బురెడ్డిపల్లె సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా దేవాలయ చైర్మన్ ప్రహల్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News