- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ జిల్లా, మండలిస్థాయి నేతలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. సన్నబియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోళ్లపై ఈ సమావేశంలో మంత్రి.. నేతలతో చర్చించారు. సన్నబియ్యం సంబరాల్లో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొనాలని.. ధాన్యం కొనుగోళ్లలోనూ పాల్గొని రైతులకు సహకరించాలని ఉత్తమ్ సూచించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సన్నబియ్యం ప్రతి పేదలకు అందే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. గతంలో 2.80 కోట్ల మందికి బియ్యం ఇస్తే.. ఇప్పుడు 3.10 కోట్ల మందికి ఇస్తున్నామని తెలిపారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే.. ప్రజలు తినలేదని.. ఆ బియ్యం పక్కదారి పట్టేదని ఆయన చెప్పారు. ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయేలా సన్నబియ్యం నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
- Advertisement -