Thursday, January 23, 2025

మే నెల నుంచి అంగన్‌వాడీలకు సన్న బియ్యం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మే నెల నుంచి రాష్ట్రంలో అంగన్‌వాడీలకు సన్నబియ్యం అందించనున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఆదివారం నూనత సచివాలంయలోని తన చాంబర్‌లో సన్నబియ్యం ఫైల్‌పై మంత్రి తొలిసంతకం చేశారు. ఈ సందర్బంగా గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలోని 35,700 అంగన్ వాడీ కేంద్రాల్లోని 15లక్షల మందికిపైగా పిల్లలకు , మాతా శిశుసంరక్షణలో భాగంగా లక్షలాది మంది బాలింతలకు , గర్భిణిలకు పోషకారాన్ని అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.

ఇందకోసం ప్రతినెల కోటి 80లక్షలు విలువచేసే 2116 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఐసిడిఎస్ కింద అంగన్ వాడీ కేంద్రాలకు అందజేస్తామని తెలిపారు. అంతకు ముందు మంత్రి ఉదయం నూతన సచివాలయానికి చేరుకున్నారు. కుటుంసభ్యులతో కలిసి వేద మంత్రోచ్చారణల మధ్య తన చాంబర్‌లోకి ప్రవేశించారు. పూజాకార్యక్రమాలు నిర్విహించి తన సీట్‌లో ఆశీనులయ్యారు. అంగన్‌వాడీలకు సన్నబియ్యం ఫైల్‌పైన తొలిసంతకం చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమీషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News