బిసి సంక్షేమ,పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్: గురుకులాలు, ప్రభుత్వ వసతి నిలయాలు, పాఠశాలలకు సన్నబియ్యం పంపిణి జరుగుతుందని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం ప్రతినెల పాఠశాలలకు 3000 మెట్రిక్ టన్నులు, సంక్షేమ హస్టళ్లకు, గురుకులాలకు 14,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్నే పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. పాఠశాలల నిర్వాహకులు, ఎంఈవోలు, హాస్టల్ ఇంచార్జిల సమక్షంలోనే గోడౌన్లలో బియ్యం క్వాలిటీ చెకింగ్ చేసిన తర్వాతే ఆయా విద్యాలయాలకు బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రం లోని కొన్ని ప్రాంతాల్లో హాస్టళ్లలో అన్నం ముద్దగా అవుతుందని వచ్చిన వాటిపై డిఫార్మెంట్ ద్వారా తనిఖీ చేసి ఆ కొత్త సన్న బియ్యాన్ని పాత సన్న బియ్యం తో రిప్లేస్ చేయడం జరుగుతుందన్నారు.