కరోనా కట్టడికి ఇళ్లకే పరిమితం కానున్న 20 మిలియన్ మంది
బీజింగ్ : ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు బీజింగ్‌లో శీతాకాల ఒలింపిక్ క్రీడోత్సవాలు జరగనుండగా, చైనా లోని మూడో ప్రముఖ నగరమైన అన్యంగ్ కఠినమైన ఆంక్షలతో లాక్‌డౌన్ అమలు లోకి వెళ్లనున్నది. కరోనా కట్టడి కోసం మొత్తం 20 మిలియన్ ప్రజలను ఇళ్లకే పరిమితం చేయనున్నారు. పర్యాటక కేంద్రమైన జియాన్, రేవు పట్టణం తియాన్‌జిన్, తరువాత సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్ లోని 5.5 మిలియన్ జనాభా గలిగిన నగరం అన్యంగ్. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కొత్తగా 58 కరోనా కేసులు నమోదయ్యాయి. అన్యంగ్‌లో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని మున్సిపల్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా చైనా లోని వివిధ ప్రాంతాలతో కలిపి దాదాపు 200 కేసులు నమోదయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్ మంగళవారం వెల్లడించింది. స్థానికంగా కొత్త కేసులు హెనన్‌లో 87,షాంక్సీలో 13, తియాన్‌జిన్‌లో 10 నమోదయ్యాయని , ఇంకా విదేశీయుల నుంచి వచ్చిన వారికి సంబంధించి 11 ప్రావిన్సియల్ స్థాయి రీజియన్లలో 82 కేసులు నమోదైనట్టు వివరించింది. మొత్తం 3458 మంది చికిత్స పొందుతుండగా, వారిలో 21 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వేర్కొంది. అన్యంగ్ నగరంలో సూపర్ మార్కెట్లన్నీ మూతపడ్డాయి.