- Advertisement -
కొత్తగూడెం భద్రాద్రి: భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద 54.7 అడుగులకు చేరింది. ముంపుప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే పలువురిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. భద్రాచలంలో ఐదు పునరావాస కేంద్రాలకు వరద బాధితులను తరలించారు. గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ ప్రధాన రహదారిపై నీరు చేరింది. దీంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది.
Also Read: బురఖా ధరించకపోతే బస్సు ఎక్కకూడదట !
- Advertisement -