Thursday, December 19, 2024

ఎల్‌బి నగర్‌లో పంద్రాగస్టు రోజున మహిళపై థర్డ్ డిగ్రీ

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: స్వాతంత్రం దినోత్సవం రోజున మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది.  నడుచుకుంటూ వస్తున్న మహిళపై పోలీసు వాహనంలో ఎక్కించుకొని మరి పోలీసులు ప్రతాపం చూపించారు. రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచుకొని చిత్రహింసలు గురిచేసి ఉదయం పంపించారు.  మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీ నంది హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 4 లో భర్త చనిపోవడంతో వర లక్ష్మీ అనే మహిళ తన కూతురుతో  కలిసి జీవిస్తోంది. తన కూతురు పెళ్లి కోసం ఎల్బీనగర్ నుంచి సరూర్ నగర్ రోడ్డు వైపులోని బంధువుల ఇంటికి డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది. ఆగస్టు 15న మంగళవారం రాత్రి తిరిగి ఎల్బీనగర్ వస్తుండగా ఎల్బీనగర్ సర్కిల్ లో పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తరలించి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆమె ఎదురు తిరిగితే సంగతి తెలుస్తామంటూ మోకాళ్లు, పిక్కలు, తొడలపై లాఠీలతో చితకబాది  నానా ఇబ్బందులకు గురిచేశారు.  ఉదయం ఏడు గంటలకు  మరో పోలీస్ అధికారి వచ్చి ఇంటికి పంపించాలని చెప్పడంతో వదిలిపెట్టారు.

Also Read: తల్లి ముందే 12 ఏళ్ల బాలికను కత్తితో పొడిచిన ప్రేమోన్మాది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News