ముంబయి: ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌పై స్థానిక ఎనిమిదవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్(ఎన్‌బిడబ్ల్యు) జారీ చేసింది. పరమ్ బీర్ సింగ్‌పై ఎన్‌బిడబ్ల్యు జారీ కావడం ఇది మూడవసారి. తాజాగా జారీ అయిన ఎన్‌బిడబ్ల్యుతో పరమ్ బీర్ సింగ్‌ను పరారీలో ఉన్న నిందితునిగా ప్రకటించడానికి పోలీసులకు అవకాశం ఏర్పడింది. ఎన్‌బిడబ్ల్యు జారీ కావడంతో పరమ్ బీర్ సింగ్ ఆస్తులను జప్తు చేసే అధికారం తమకు లభించిందని, ఆయనపై రెడ్ కార్నర్ నోటీసు జారీచేసే ప్రక్రియను కూడా చేపట్టేందుకు మార్గం ఏర్పడిందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ శేఖర్ జగతాప్ తెలిపారు. రెండు కేసులలో ఇప్పటివరకు సింగ్‌పై ఆరు ఎన్‌బిడబ్ల్యులు జారీ అయ్యాయి. థాణెలో నమోదైన ఒక కేసుకు సంబంధించి ఇదివరకే ఆయనపై ఎన్‌బిడబ్ల్యు జారీ అయింది. థాణె కేసులో సింగ్‌పై లుక్ ఔట్ సర్కులర్ కూడా జారీ అయింది. డబ్బు కోసం ఒక వ్యాపారిని బెదిరించిన కేసులో మరైన్ డ్రైవ్ పోలీసు స్టేషన్‌లో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా ఈ కేసులో తాజాగా జారీ అయిన ఎన్‌బిడబ్ల్యు మూడవది.
పరమ్ బీర్ సింగ్‌పై మూడవ ఎన్‌బిడబ్ల్యు జారీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -