దక్షిణాఫ్రికా- ఇండియాల మధ్య కీలకమైన చివరి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకూ ఇరు జట్లూ చెరో మ్యాచ్ లోనూ గెలిచి సమవుజ్జీలుగా ఉన్నాయి. సిరీస్ ఎవరిదో తేల్చే చివరి మ్యాచ్ పార్ల్ లో ఈ రోజు సాయంత్రం జరగబోతోంది.
టీమిండియా ఓపెనర్లలో కొత్తగా అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ అద్బుతమైన ప్రతిభను కనబరుస్తున్నాడు. అయితే మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీరిస్ లో వెనుకబడటం జట్టును కుంగదీస్తోంది. అతను మొదటి మ్యాచ్ లో ఐదు పరుగులకు, రెండో మ్యాచ్ లో నాలుగు పరుగులకు అవుటయ్యాడు. మరోవైపు తిలక్ వర్మ ఆటతీరు కూడా చెప్పుకోదగిన స్థాయిలో లేదు. వీళ్లిద్దరూ రాణిస్తే, మూడో మ్యాచ్ లో టీమిండియాకు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. రెండో వన్డేలో గెలిచిన దక్షిణాఫ్రికా.. మూడో మ్యాచ్ లోను గెలిచి, సీరీస్ ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. రెండో వన్డేలో జోర్జి సెంచరీ చేసిన విషయం తెలిసిందే.