Monday, January 20, 2025

మూడో వన్డే.. భారత్ బ్యాటింగ్

- Advertisement -
- Advertisement -

చట్టోగ్రామ్: ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగే చివరి వన్డేలోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న మూడ‌ో వ‌న్డేలో ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేయ‌నున్న‌ది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ముందుగా బౌలింగ్ ఎంచుకున్న‌ది. ఇండియా జ‌ట్టులో రెండు మార్పులు చేశారు. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా బ‌రిలోకి దిగుతున్నాడు. ఇషాన్ కిష‌న్‌, కుల్దీప్ యాద‌వ్‌లు జ‌ట్టులోకి వ‌చ్చారు. బంగ్లా జ‌ట్టు కూడా రెండు మార్పులు చేసింది. ట‌స్కిన్‌, యాసిర్ అలీలు జ‌ట్టులోకి వ‌చ్చారు.

మరోవైపు టీమిండియాకు చివరి వన్డే సవాల్‌గా మారింది. ఇటీవల కాలంలో టీమిండియా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమవుతోంది. తొలి రెండు వన్డేల్లో ఆశించిన విధంగా రాణించలేక పోయింది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యాలు జట్టును వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సీనియర్లు శిఖర్ ధావన్, విరాట్ కోహ్లిలు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నారు. తొలి రెండు మ్యాచుల్లో కోహ్లి పూర్తిగా నిరాశ పరిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ సేవలు కూడా జట్టుకు అందుబాటులో లేకుండా పోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News