Monday, December 23, 2024

డబుల్ ఇస్మార్ట్ నుంచి థర్డ్ సింగిల్ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూ వీ డబుల్ ఇస్మార్ట్ మ్యూజిక్ ప్రమోషన్‌లు బ్లాక్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ సింగిల్ స్టెప్ మార్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. సెకెండ్ సింగిల్ మార్ ముం త చోడ్ చింత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అ య్యింది. ఇప్పుడు మేకర్స్ థర్డ్ సింగిల్ అ ప్డేట్ ఇచ్చారు. డబుల్ ఇస్మార్ట్ థర్డ్ సింగిల్ క్యా లఫ్డా ఈనెల 29న రిలీజ్ కానుంది.

రామ్, కావ్యా థాపర్ రొమాంటిక్ కెమిస్ట్రీని వండర్‌ఫుల్‌గా చూపించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. పూరి కనెక్ట్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News