సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు భారత్ 131 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. రిషబ్ పంత్ దూకుడుగా ఆడి 97 పరుగులు చేయడంతో గెలస్తామనే ధీమా వచ్చింది. రిషబ్ పంత్, పుజారా (205 బంతుల్లో 77 పరుగులు) వెనువెంటనే ఔట్ కావడంతో హనుమాన్ విహారీ 161 బంతుల్లో 23 పరుగులు చేయగా రవీచంద్రన్ అశ్విన్ 128 బంతుల్లో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ఆసీస్ విజయానికి అడ్డుకట్టవేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయాన్, జోష్ హజీల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టా కమ్నీస్ ఒక్క వికెట్ తీశాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే 1-1 తో భారత్ ఆస్ట్రేలియా జట్లు సమజ్జీవులుగా ఉన్నాయి.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 338
భారత్ తొలి ఇన్నింగ్స్: 244
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్:312/6 డిక్లేర్డ్
భారత్ రెండో ఇన్నింగ్స్: 334/5