Courtesy by BCCI Twitter
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో డేనైట్ టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 21 ఆధిక్యాన్ని అందుకుంది. స్పిన్నర్ల హవా సాగిన ఈ గులాబి బంతి మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 8 పరుగులకే ఐదు వికెట్లు తీసి భారత్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. ఇక జాక్ లీచ్ 4 వికెట్లతో తనవంతు పాత్ర పోషించాడు. అయితే టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 33 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు గెలుపు కోసం కేవలం 49 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఈ లక్ష్యాన్ని టీమిండియా 7.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 25 (నాటౌట్), శుభ్‌మన్ గిల్ 15 (నాటౌట్) ఈ లాంఛనాన్ని సునాయాసంగా పూర్తి చేశారు. దీంతో మూడో టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోపే ముగిసింది.