Wednesday, January 22, 2025

మూడోసారి అధికారమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్ : మూడవ సారి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుక రావడమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధ్ది కార్యక్రమాలను ప్రజలలోకి వెళ్ళే విధంగా కృషి చేయాలని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోయినిపల్లిలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యలయంలో శుక్రవారం నియోజకవర్గం యూత్ ఉపాధ్యక్షుడిగా ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ గ్రామానికి చెందిన గుర్రం వినయ్ రెడ్డిని నియమించిన సందర్భంగా పార్టీ మండల ప్రధాన కార్యదిర్శ పన్నాల కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని మర్యాద పూర్వకంగా కలసిశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత సేవలు పార్టీకి ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు డొంకని బిక్షపతి గౌడ్, అవుషాపూర్ ఉపసర్పంచ్ ఐలయ్య యాదవ్, వార్డు సభ్యులు బొడిగె శ్రీనివాస్ గౌడ్, పార్టీ నాయకులు కందకట్ల దయాకర్ రెడ్డి, శ్యామ్ రావు, బాల్‌రాజ్, యూసుబ్, బురాన్, సాయి, మహ్మద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News