బడులు ప్రారంభిస్తే వైరస్ విజృంభణ చేస్తుందని ఆందోళన
సెకండ్‌వేవ్‌లో 1600మందికి సోకిన మహమ్మారి
హైస్కూల్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని సూచనలు
చిన్నారులకు రెండు నెలల తరువాత పాఠాలు చెప్పాలని వినపం
హైదరాబాద్: నగరంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతో ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని విద్యా సంస్థలు ప్రారంభించాలని సూచించడంతో ఆదిశగా యాజమాన్యాలు సిద్దమైతున్నారు. ఇప్పటికే విద్యార్థులకు తగిన ఏర్పాట్లు చేసి, టీచర్లలంతా రేపటి నుంచి పాఠశాలలకు హాజరుకావాలని సూచించారు. బడులు అట్టహాసంగా ప్రారంభించిన విద్యార్థుల తల్లిదండ్రుల పాఠశాలల ప్రారంభంపై వ్యతిరేకత చూపుతున్నారు. దశలవారీగా కాకుండా ఒకేసారి తరగతులు ప్రారంభించడంతో థర్డ్‌వేవ్ విరుచుక పడుతుందని భయందోళన వ్యక్తం చేస్తున్నారు. సెకండ్ వేవ్‌లో వివిధ ఆసుపత్రుల్లో 1600మంది చిన్నారులకు వైరస్ సోకితే చికిత్స అందించారు. వైరస్ విజృంభించకుండా గతేడాది తరహాలో ప్రాథమిక విద్యార్థులకు కొంతకాలం పాటు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని, ప్రత్యక్ష పాఠాలు బోధిస్తే చిన్నారులంతా ఒకే దగ్గర చేరితే ఒకరికి దగ్గు,జ్వరం, జలుబు లక్షణాలుంటే అందరికి సోకుతుందని, దీంతో పాఠశాల మొత్తం విద్యార్థులు ఆనారోగ్యం బారిన పడే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు.
హైదరాబాద్ జిల్లాలో 1307 ప్రభుత్వ పాఠశాలుండగా, వీటిలో 182 ప్రభుత్వ పాఠశాలలు, 1125 ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 2.50లక్షల మంది విద్యార్థులున్నారు. వీరంతా తరగతులకు హాజరైతే మహమ్మారి మళ్లీ విలయతాండం చేస్తుందని, థర్డ్‌వేవ్ వస్తే అదుపు చేయడం కష్టమని, పిల్లలకు కరోనా రాకుండా ఉండాలంటే మరికొన్ని రోజుల పాటు బడులకు దూరంగా ఉంచితే ఆరోగ్యంగా ఉంటారని తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు సూచిస్తున్నారు. మరోసారి అన్ని పాఠశాల ప్రారంభంపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రైవేటు పాఠశాల్లో కోవిడ్ నిబంధనలు పాటించరని, ఫీజులు వసూలు చేయడమే తప్ప చిన్నారుల ఆరోగ్యంపై పట్టించుకోరని, దీంతో చిన్నారులు వైరస్ ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చాలామంది తల్లిదండ్రులు స్కూళ్ల ప్రారంభమైన పది రోజుల తరువాత కరోనా ప్రభావం లేకుంటే పిల్లలను బడిబాట పంపిస్తామని, ఈసమయంలోగా విద్యార్థులంతా సురక్షితంగా ఉంటే తమ చిన్నారులను తరగతిలోకి తీసుకొస్తామని పేర్కొంటున్నారు. బడులు ప్రారంభించేది కార్పొరేట్ పాఠశాలలు ఫీజులు వసూలు చేసుకోవడానికి తెరిచినట్లు ఉందని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తరువాత వైరస్ లక్షణాలు పిల్లలో ఉన్నాయని ప్రచారం చేసి, మూసివేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చిన్నారులు సేఫ్‌గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.