Friday, November 15, 2024

చలికాలంలో థర్డ్‌వేవ్ ముప్పు….

- Advertisement -
- Advertisement -

మరోసారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా
కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తాయంటున్న వైద్యులు
జాగ్రత్తలు పాటించకుంటే వైరస్ రెచ్చిపోతుందని హెచ్చరికలు
దగ్గు, జలుబు సీజనల్ వ్యాధుల వచ్చిన టెస్టులు చేయించుకోవాలి

Coronavirus Could Be Detected Up to 10 Ft in Air Around Infected Person

మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో గత ఆరునెల నుంచి తగ్గిన మహమ్మారి చలి కాలంలో మరోసారి విజృంభించే అవకాశం ఉందని జిల్లా వైద్యాధికారులు భావిస్తున్నారు. త్వరలో చలి తీవ్రత పెరుగుతుందని దీంతో జలుబు, జ్వరం, దగ్గు వంటితో జనం బాధపడే పరిస్దితి ఉంటుందని, నగర ప్రజలు వైరస్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్షం చేయకుండా సమీపంలోని ఆరోగ్య కేంద్రాల వద్దకు వెళ్లి కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 60కిపైగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. వీటికి తోడు కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత నెల రోజుల నుంచి వరుసగా బతుకమ్మ, దసరా పండగలు రావడంతో ప్రజలంతా ఒకే దగ్గరి చేరి వేడుకలు చేసుకోవడంతో దాని ప్రభావం మెల్లగా కనిపిస్తుందని పేర్కొంటున్నారు. నగరవాసులు ఇష్టానుసారంగా తిరిగితే థర్డ్‌వేవ్ రెచ్చిపోయి లాక్‌డౌన్ విధించే వాతావరణ నెలకొంటుందన్నారు.

ఇప్పటికే కరోనాకు పుట్టిల్లు చైనాలో వైరస్ విలయతాండం చేస్తూ పలు పట్టణాలు లాక్‌డౌన్ విధించే పరిస్దితికి తీసుకొచ్చింది. అలాంటివి రాకుండా జాగ్రత్తలు పాటిస్తే కరోనా వేగానికి కళ్లెం వేయవచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు. గత నెల రోజుల నుంచి సీజనల్ వ్యాధుల బారిన జనం పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అమీర్‌పేట, పంజాగుట్ట, దిల్‌షుక్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, అబిడ్స్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, తార్నాక, వనస్దలిపురం ప్రాంతాల్లో వస్త్ర దుకాణాలతో పాటు, కిరాణం, బంగారం షాపులు రద్దీగా కనిపిస్తున్నాయి. ఏ షాపులో చూసిన కోవిడ్ నిబంధనలు పాటించలేదు. వచ్చిన కస్లమర్లల్లో కనీసం సగం మంది మాస్కులు ధరించడంలేదని, దుకాణాల యాజమానులు శానిటైజర్ కూడా ప్రధానం ద్వారం ఉంచడంలేదు. సెక్యూరిటీ సిబ్బంది ఉంటే వినియోగదారులు తీసుకవచ్చే బ్యాగులు తనిఖీలు చేయడం తప్ప జాగ్రత్తలు పాటించడంలేదని స్దానిక వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

అదే విధంగా బస్సుల్లో కూడా జనం కిక్కిరిసిపోవడం, ప్రైవేటు బడుల్లో గుంపులు ఒకే విద్యార్ధులను చేర్చడంతో భవిష్యత్తులో వైరస్ రెక్కలు కట్టుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. చలికాలం గడిచే వరకు నగర ప్రజలు ముఖానికి మాస్కులు, బౌతికదూరం తప్పకుండా పాటించాలని, నిర్లక్షం చేస్తే కరోనా కాటు వేయకతప్పదంటున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు షాపులను తనిఖీ చేసి కోవిడ్ నిబంధనలు పాటించని యాజమానులపై జరిమానాలు విధించాలని కోరుతున్నారు. అదే విధంగా రోడ్లపై కార్లు, ద్విచక్ర వాహనాలపై తిరిగే వారు కూడా నామ మాత్రంగా మాస్కులు ధరిస్తూ, ద్విచక్ర వాహనాలపై త్రీబుల్ రైడింగ్ చేస్తూ బౌతికదూరం పాటించని వారిపై పైన్ వేయాలని ట్రాఫిక్ పోలీసులకు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News