Monday, November 18, 2024

లక్షణాలు లేకున్నా కొవిడ్‌తో ముప్పే

- Advertisement -
- Advertisement -
Thirty with Covid‌-19 without symptoms
అమెరికాలో ఫెయిర్ హెల్త్ సంస్థ అధ్యయనంలో వెల్లడి

వాషింగ్టన్ : కొవిడ్ 19 సోకినా వైరస్ లక్షణాలు బయటపడని వారిలో ఐదో వంతు మంది దీర్ఘకాల కరోనాతో బాధ పడుతున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ఫెయిర్ హెల్త్ అనే స్వచ్ఛంద సంస్థ అమెరికాలో నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ వివరాలు బయటపడ్డాయి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది వరకు నమోదైన దాదాపు 20 లక్షల మంది కరోనా బాధితుల కేసులను వీరు విశ్లేషించారు. 20 లక్షల మందిలో 4.54 లక్షల మంది కరోనా సోకిన నెలన్నర రోజుల తరువాత వివిధ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరారని వెల్లడైంది. ఇలా ఆస్పత్రుల్లో చేరిన వారిలో తేలికపాటి లేదా ఓ మోస్తరు కొవిడ్ నుంచి కోలుకున్నవారు 27 శాతం మంది, లక్షణాలు బయటపడని కరోనా నుంచి కోలుకున్న వారు 19 శాతం మంది ఉన్నట్టు గుర్తించామని ఫెయిర్ హెల్త్ సంస్థ అధ్యక్షులు రాబిన్ గెల్బర్డ్ వెల్లడించారు. ఈ విధంగా లక్షణాలు లేని ఈ 19 శాతం మందిలో దీర్ఘకాల కరోనాను గుర్తించినట్టు తెలియచేశారు.

కరోనా నిర్ధారణ అయిన నాలుగు వారాల తరువాత కూడా లక్షణాలు తగ్గక పోవడాన్ని దీర్ఘకాల కరోనా అంటారు. మొత్తం 20 లక్షల మంది ఆరోగ్య నివేదికలను విశ్లేషించగా దాదాపు సగం మంది ఎసింప్టమాటిక్ కొవిడ్ ఇన్‌ఫెక్షన్ బాధితులేనని తేలింది. మిగతా 40 శాతం మందిలో కొవిడ్ లక్షణాలు బయటపడినప్పటికీ ఆస్పత్రుల్లో చేరాల్సినంత తీవ్రస్థాయిలో ఇన్‌ఫెక్షన్ సోకలేదు. మిగతా ఒక శాతం మందిలో వాసన, రుచిని కోల్పోవడం వంటి లక్షణాలు బయటపడ్డాయి. వీరిలో 5 శాతం మంది ఆస్పత్రిలో చేరాల్చి వచ్చింది. ఎసింప్టమాటిక్ ఇన్‌ఫెక్షన్ బారిన పడిన వారిలో ఐదో వంతు మంది దీర్ఘకాల కొవిడ్‌తో బాధపడుతున్నట్టు తేలింది. మొత్తం మీద కరోనా సోకిన తరువాత ఆస్పత్రుల్లో చేరిన వారిలో 594 మంది పూర్తిగా కోలుకున్నప్పటికీ నెలన్నర రోజుల తరువాత వివిధ ఆరోగ్య సమస్యలతో మృతి చెందారని రాబిన్ వివరించారు. దీర్ఘకాల కరోనాలో ముఖ్యంగా ఒంటి నొప్పులు, శ్వాస సంబంధ సమస్యలు, అధిక కొవ్వు, అధిక రక్తపోటు వంటి లక్షణాలు ఉన్నాయి. వైరస్‌ను ప్రారంభం లోనే గుర్తించినా ఆస్పత్రిలో చేరక పోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని పరిశోధకులు వివరించారు. ఈ దీర్ఘకాల కరోనా బాధితుల్లో ఎక్కువ శాతం మంది మహిళలే ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News