Monday, March 31, 2025

ఫోన్‌ట్యాపింగ్‌ కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తిరుపతన్న

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన వేసిన బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టిన న్యాయస్థానం..తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింంది. ఈ క్రమంలో తమకు కొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ కోటేశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనం కౌంటర్‌ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వానికి రెండు వారాల సమయం ఇచ్చంది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్‌ 18కి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News