యుద్ధ విమాన పయనంపై మోడీ
న్యూఢిల్లీ : రాష్ట్రపతి జీ ధీరవనితగా అసాధారణ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారని ప్రధాని నరేంద్ర మోడీ కితాబు ఇచ్చారు. శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన నేపథ్యంలో ప్రధాని తమ స్పందన తెలిపారు. రాష్ట్రపతి పలు సార్లు తమ అనన్య సామాన్య ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ వచ్చారు. ఇప్పటి సుఖోయ్ ఫైటర్‌లో ఆమె ప్రయాణ విన్యాసం మరో కీలక అంశం అవుతుందన్నారు.
ప్రతి భారతీయుడికి ఈ ఘట్టం స్ఫూర్తిదాయకం అయిందని మోడీ తెలిపారు. యుద్ధ విమానంలో ప్రయాణం తరువాత రాష్ట్రపతి ముర్మూ వెలువరించిన ట్వీటును ప్రధాని మోడీ ఈ నేపథ్యంలో జతచేశారు. ప్రధాని మోడీ తమ ట్వీటులో దేశంలోని ప్రజలంతా యోగాను తమ దైనందిన జీవితంలో ఓ అంతర్భాగం చేసుకోవాలని కోరారు. అంతర్జాతీయ యోగాదినోత్సవం మరో 75 రోజుల్లో ఉన్న నేపథ్యంలోనలుమూలల పలు రీతులలో యోగాకు ప్రోత్సాహం, దీనిని జనంలోకి మరింతగా తీసుకుపోవడం జరగాల్సి ఉందన్నారు.