Thursday, January 23, 2025

ఈడి సమన్లు ఓ ‘కుట్ర’ : సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

Sanjay Raut

ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనకు జారీ చేసిన సమన్లను “కుట్ర” అని అభివర్ణించారు.  తనను చంపేసినా సరే, మహారాష్ట్రలోని తిరుగుబాటు ఎమ్మెల్యేల మాదిరి గౌహతి రూట్లోకి వెళ్లనని అన్నారు. ముంబై ‘చాల్’ రీ-డెవలప్‌మెంట్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ దర్యాప్తులో ప్రశ్నించడానికి ఈడి మంగళవారం రౌత్‌ను పిలిచినట్లు అధికారులు తెలిపారు. అస్సాంలోని గౌహతి నగరంలో శిబిరాలు వేసుకున్న రెబల్ ఎమ్మెల్యేల  మహారాష్ట్ర మహా వికాస్ అఘాడి ప్రభుత్వ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న తరుణంలో  ఈ పరిణామం చోటుచేసుకుంది.

“ఈడీ నాకు నోటీసు పంపిందని నాకు ఇప్పుడే తెలిసింది. మహారాష్ట్రలో పెను పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మేమంతా (సేన వ్యవస్థాపకుడు) బాలాసాహెబ్ శివసైనికులం. ఇది కుట్ర. నా తల నరికి చంపినా నేను గౌహతి మార్గం ఎంచుకోను” అని రౌత్ మరాఠీలో చేసిన ట్వీట్‌లో బిజెపి  నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ను ట్యాగ్ చేశారు.

ఈడికి దమ్ముంటే తనని అరెస్టు చేయాలని ఆ రాజ్యసభ సభ్యుడు సవాలు విసిరారు.  ఇదిలావుండగా,  బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ ను భయపెట్టడానికే ఈడి సమన్లు జారీ చేసిందని అతడి సోదరుడు ఎమ్మెల్యే సునీల్ రౌత్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News