Monday, January 20, 2025

ఇది చారిత్రాత్మక విజయం

- Advertisement -
- Advertisement -

మహిళా బిల్లు ఆమోదంపై ఎంఎల్‌సి కవిత

మన తెలంగాణ/హైదరాబాద్ : చారి త్రాత్మక క్షణం.. సుదీర్ఘ పోరాటానికి ఎట్టకేలకు తగిన గుర్తింపు లభిం చిం దని, పార్లమెంట్‌లో మహిళా రిజర్వే షన్ బిల్లు ఆమోదం పొందిందని ఎం ఎల్‌సి కవిత హర్షం వ్యక్తం చేశారు. సమానత్వం, ప్రజా స్వామ్యం ప్రతి భారతీయ మహిళా శక్త్తి విజయాన్ని జ రుపుకుంటున్నామని ఆమె ఈ సందర్భంగా అన్నారు.

ఈ విజయం కేవలం రాజకీయాలకు సంబంధించినది కాదు.. పురోగతి, ప్రాతినిధ్యం, అడ్డంకులను బద్దలు కొట్టడమేనన్నారు. మహిళల బలం, దృఢత్వం, అచంచ లమైన స్ఫూర్తి సమగ్రమైన సాధికారత కలిగిన భారత దేశానికి మార్గం సుగమం చేసిందని వెల్లడించారు. ప్రతి మహిళ సామర్థ్యాన్ని గుర్తించి, గౌరవం దక్కినప్పుడే భవిష్యత్తుకు చీర్స్ అని ఆమె పేర్కొన్నారు. ఒబిసి మహి ళలను కాపాడేందుకు హామీ ఇవ్వబడిన ప్రాతి నిథ్యం కోసం తాము పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సంద ర్భంగా ఎంఎల్‌సి కవిత ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News