Friday, December 20, 2024

సేవకుడిలా పనిచేస్తా… అప్పుల రాష్ట్రాన్ని గట్టెక్కిస్తా…

- Advertisement -
- Advertisement -

నెల రోజుల పాలనపై భట్టి విక్రమార్క ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి నెల రోజులయింది. కాంగ్రెస్ నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ట్విట్టర్ వేదికగా ఆదివారం స్పందించారు. ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల పాలనలో వారి కలలను నిజం చేయడమే లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్నాము. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఇచ్చిన అధికారంతో విర్ర వీగకుండా వెన్నులో భయం పెట్టుకొని పని చేస్తామని ఆయన రాసుకొచ్చారు.

అదే విధంగా 10 సంత్సరాల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పు నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడ్తానన్నారు. గత ప్రభుత్వ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ ఉద్యోగులకు రెండో తేదీని జీతాలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్‌ది. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ నా కోసం ఏర్పాటు చేశారని ప్రతి పౌరుడు అనుకునే విదంగా మా పరిపాలన సాగుతుందని డిప్యూటీ సీఎం భట్టి తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News