మనతెలంగాణ/హైదరాబాద్: భాగ్యనగరం లో జరగాల్సిన ఫార్ములా- ఇరేస్ రద్దు కావడం కాంగ్రెస్ ప్ర భుత్వం తీసుకున్న తిరోగమన నిర్ణయమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ట్విట్టర్(ఎక్స్) విమర్శించారు. హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా- ఇ రేస్ రద్దు కావడంపై కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే నిర్ణయాలు సరికావని.. ఇ ప్రిక్స్ వంటి ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా మన బ్రాండ్ పెంచుతాయని చెప్పారు.
అలాంటి ఈవెంట్లు నిర్వహించకపోవడం తిరోగమన స్థితికి వెళ్లడమేనని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా కేంద్రంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫార్ములా ఇఒరేస్ ను బిఆర్‌ఎస్ హయాంలో చక్కటి అవకాశంగా ఉపయోగించుకున్నట్లు పేర్కొన్నా రు. సస్టయినబుల్ మొబిలిటీ సొల్యూషన్స్‌కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమో ట్ చేసేందుకు తాము తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రారంభించినట్లు చెప్పారు.