Saturday, November 23, 2024

బిల్లులపై స్పందించేందుకు ఇది సమయం కాదు: గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిల్లులపై స్పందించేందుకు ఇది సమయం కాదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో ఆమె మీడియాతో చిట్ చాట్ చేస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం.. శాసనసభ, మండలిలో 12 బిల్లులను పాస్ చేసి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదం కోసం పంపించింది. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిన తర్వాతే చట్టరూపం దాల్చి, అమల్లోకి రానున్నాయి. బిల్లుల విషయానికి వస్తే గతంలో గవర్నర్ తిప్పి పంపిన 3 బిల్లులు, తిరస్కరించిన ఒక బిల్లును ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలిపి మళ్లీ గవర్నర్ వద్దకు పంపారు.

ఈ జాబితాలో తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు- 2022, తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, నియంత్రణ సవరణ బిల్లు- 2022, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యూయేషన్ సవరణ బిల్లు- 2022, తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు- 2022 ఉన్నాయి. ’ఎట్ హోం’ కార్యక్రమానికి బిజెపి పార్టీ అధికార ప్రతినిధి సుభాష్ మాజీ ఎంఎల్‌ఎ నందీశ్వర్ గౌడ్ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, సిఎస్ శాంతికుమారి, డిజిపి అంజనీ కుమార్, టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎండి కృష్ణ ఎల్ల, జెఎండి సుచిత్ర ఎల్ల, స్వాతంత్య్ర సమరయోధులు, పలువురు ప్రముఖులు గవర్నర్ ఎట్ హోంకు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News