Friday, December 20, 2024

జూన్ బ్యాంకు సెలవుల జాబితా ఇదే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆన్‌లైన్ సదుపాయాలు ఉన్నప్పటికీ ఖాతాల్లో డబ్బులు వేయాలన్నా లేదా పెద్దమొత్తం నగదు తీసుకోవాలన్నా, డ్రాఫ్ట్‌లు వంటి వాటి కోసం బ్యాంకులకు వెళ్లాల్సిందే. అయితే కొద్ది రోజుల్లో జూన్ నెల ప్రారంభం కానుంది. వచ్చే నెలలో కూడా అత్యధికంగా 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. కావున ఏమైనా బ్యాంకు పనులు ఉంటే ముందస్తుగానే చేసుకోండి. తర్వాత ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

జూన్ బ్యాంకు సెలవుల జాబితా ఇదే..
జూన్ 4 : ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తారు
జూన్ 10 : రెండో శనివారం బ్యాంకులకు సెలవు
జూన్ 11 : ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు
జూన్ 15 : రాజా సంక్రాంతి కారణంగా మిజోరం, ఒడిశాలో బ్యాంకులు మూసివేస్తారు
జూన్ 18 : ఆదివారం నాడు బ్యాంకులకు సెలవు
జూన్ 20 : రథయాత్ర కారణంగా ఒడిశాలో బ్యాంకులు మూసివేస్తారు
జూన్ 24 : -నాలుగో శనివారం బ్యాంకులు మూసివేస్తారు
జూన్ 25 : ఆదివారం బ్యాంకులకు సెలవు
జూన్ 26 : ఖర్చీ పూజ కారణంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు
జూన్ 28 : ఈద్ ఉల్ అజా కారణంగా కేరళ, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్‌లో సెలవు
జూన్ 29 ఈద్ ఉల్ అజా సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేస్తారు
జూన్ 30 :- మిజోరాం, ఒడిశాలో రీమా ఈద్ ఉల్ అజా బ్యాంకులకు సెలవు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News